ముగిసిన శ్రీ సీతారామచంద్ర కళ్యాణ బ్రహ్మోత్సవాలు..

నవతెలంగాణ-రామగిరి
రామగిరి మండల కేంద్రంలోని సెంటినరి కాలనీలో శ్రీ కోదండ రామాలయం ,శ్రీ షిరిడి బాబా ఆలయంలో ఈ నెల 15 నుండి 19 వరకు  జరుగుతున్న శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు శుక్రవారం తో ముగిశాయి. శ్రీ రామనవమినీ పురస్కరించకుని స్థానాచార్యులు జగన్నాథచార్యులు ,ఆలయ పూజారులు వేణు మనోహర చర్యలు, శ్యాం సుందర చార్యులు ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణ మహోత్సవానికి ఆలయ కమిటీ చైర్మన్ వనం రాంచందర్ రావు దంపతులు పట్టు వస్త్రాలు, సెక్రెటరీ ముప్పిడి రవీందర్ దంపతులు తలంబ్రాలను సమర్పించారు.  ఈ కార్యక్రమానికి  ఆర్ జి-3 జిఎం ఎన్ సుధాకర్ రావు, మంథని సిఐ వెంకటేశ్వర్లు , చిట్ట వెంకటరమణ శర్మ దంపతులు, తోట చంద్రయ్య దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆలయ వర్కింగ్ చైర్మన్ గంట వెంకట రమణారెడ్డి  ,వైస్ చైర్మన్ కాటo  సత్యం ,తిప్పర్తి రవీందర్ రెడ్డి కోరుకొప్పుల తులసి రామ్ గౌడ్, జాయింట్ సెక్రెటరీ  వేగోలపు సత్యనారాయణ గౌడ్,ఎంఆర్ సి రెడ్డి, కోట రవీందర్ రెడ్డి ,వెంకటరమణ గార్ల ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు, దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.అలాగే విశాఖ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గడ్డం సరోజన వివేక్ వెంకటస్వామి గార్లు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రత్యెక పూజలలో పాల్గొన్నారు. శోభ యాత్ర కార్యక్రమంలో దేవి తరంగణి కోలాట బృందం చేసిన నృత్యలు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలను  విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love