నవ తెలంగాణ మల్హర్ రావు.
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యేగా ఐదోవసారి విజయం సాధించిన దుద్దిళ్ల శ్రీదర్ బాబు గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు.రాష్ట్ర గవర్నర్ తమిలిసై ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ స్వీకారోత్సవానికి మంథని నియోజకవర్గం నుంచే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో దుద్దిళ్ల అభిమానులు తరలివెళ్లారు.