మల్హర్ మండలంలో ఘనంగా శ్రీపాదరావు జయంతి వేడుకలు

– పేదలకు పండ్లు,విద్యార్థులకు పెన్నులు,నోట్ బుక్స్ పంపిణీ
నవతెలంగాణ – మల్హర్ రావు
అజాత చత్రువు, స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాద రావు 87వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు ఆధ్వర్యంలో మండల కేంద్రమైన మండల పరిషత్ కార్యాలయం,తహశీల్దార్ తోపాటు అన్ని గ్రామపంచాయితీల్లో అధికారికంగా ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు శ్రీపాదరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాద రావు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో కొయ్యుర్ లో ఘనంగా శ్రీపాద రావు జయంతి వేడుకలు నిర్వహించి శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం పేదలకు పండ్లు,విద్యార్థులకు నోట్ బుక్స్,పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్యాం సుందర్, తహశీల్దార్ శ్రీనివాస్, జెడ్పిటిసి కోమల,వైస్ ఎంపిపి బడితేల స్వరూప రాజయ్య,ఎంపిటిసి సభ్యురాలు ఏనుగు నాగరాని,సింగిల్ విండో డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య,వొన్న తిరుపతి రావు, సంగ్గెం రమేష్,బొమ్మ రమేష్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి, ఆర్ఐ సరితా,ఎంపిడిఓ సిబ్బంది, రెవెన్యూశాఖ సిబ్బంది, ప్రత్యేక అధికారులు,పంచాయతీ కార్యదర్శులు,జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్, జంగిడి సమ్మయ్య,కేశారపు సురేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ నాయకులు,, దుద్దిళ్ళ కుటుంబ సభ్యులు,ప్రజలు పాల్గొన్నారు.
Spread the love