శ్రీపాదరావు ఆశయాలకు కృషి చేయాలి

– రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్, అజాత శత్రువు స్వర్గీయ శ్రీ దుద్దిళ్ల శ్రీపాద రావు ఆశయాలకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా  శ్రీపాదరావు 25వ వర్ధంతి వేడుకల్లో బాగంగా మంథనిలో ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మంథని నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు శ్రీపాదరావు అన్నారు. ఈ కార్యక్రమంలో  రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్, బెల్లంపల్లి ఎమ్మెల్యే  నియోజకవర్గ గడ్డం వినోద్ మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ , పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు,ఆయా మండలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love