ఎఫ్‌డిలపై శ్రీరామ్‌ ఫైనాన్స్‌ వడ్డీ రేట్ల పెంపు

హైదరాబాద్‌ : వివిధ కాలపరిమితుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించినట్లు శ్రీరామ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ తెలిపింది. పలు ఎఫ్‌డిలపై 0.05 శాతం నుంచి 0.20 శాతం వరకు వడ్డీ రేట్లను పెంచినట్లు పేర్కొంది. డిపాజిట్‌, రెన్యువల్‌ సమయంలో 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెట్టుబడిదారులు సంవత్సరానికి 0.50 శాతం అదనపు వడ్డీని పొందుతారని తెలిపింది. మహిళా పెట్టుబడిదారులకు ఏడాదికి 0.10 శాతం అదనపు వడ్డీని అందిస్తున్నట్లు పేర్కొంది. ఎఫ్‌డిలపై గరిష్టంగా 9.40 శాతం గరిష్ట వడ్డీ పొందవచ్చని తెలిపింది.

Spread the love