శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు…

నవతెలంగాణ – హైదరాబాద్
టీమిండియా యువ ఓపెనర్‌, గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన ఘనత సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టెస్టు, వన్డే, టీ20, ఐపీఎల్‌లో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా సోమవారం(మే15) అహ్మదాబాద్‌ వేదికగా ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన గిల్‌.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. కాగా గిల్‌కు ఇదే తొలి ఐపీఎల్‌ సెంచరీ కావడం గమానర్హం. ఈ మ్యాచ్‌లో 58 బంతుల్లో  101 పరుగులు చేశాడు. ఇక అంతర్జాతీయ మ్యాచ్‌ల విషయానికి వస్తే.. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో గిల్‌ డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. అనంతరం అహ్మదాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20లో సెంచరీ కూడా సాధించాడు. మరోవైపు ఇదే అహ్మదాబాద్‌ ఆస్ట్రేలియాపై టెస్టుల్లో కూడా సెంచరీ సాధించాడు. దీంతో ఈ ఏడాది మూడు ఫార్మాట్‌లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తాజాగా ఐపీఎల్‌లో కూడా గిల్‌ సెంచరీతో చేశాడు. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన గుజరాత్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.

Spread the love