బాధితులకు పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగించిన ఎస్ఐ వీరబాబు

SI Veerababu handed over the lost cell phone to the victimsనవతెలంగాణ – పెద్దవూర
సెల్ ఫోన్ పోగొట్టుకుంటే ఇక నుంచి బాధపడాల్సిన అవసరం లేదని  ఎస్ ఐ వీర బాబు అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జులై 28 వ తేదీన పెద్దవూర మండల కేంద్రానికి చెందిన బచ్చిరెడ్డి పుల్లారెడ్డి అను వ్యక్తి మండల కేంద్రం లోని చెకపొస్టు వద్ద తన సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నారు.స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. పోలీస్ సిబ్బంది సీఈఐఆర్ ద్వారా వెతికి వివో ఫోన్ ను ట్రే చేసి బాధితునికి ఆదివారం అప్పగించారు.ఈసందర్బంగా ఎస్ఐ వీరబాబు మాట్లాడుతు ఇటీవల పోలీస్ శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన సీఈఐఆర్ పోర్టల్ ద్వారా వారు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ ను గుర్తించడం జరిగిందని తెలిపారు. గుర్తించిన ఫోన్స్ ను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని వెల్లడించారు. ప్రస్తుతం సెల్ ఫోన్ లేనిది ఎటువంటి కార్యకలాపాలు ముందుకు సాగడం లేదని, ప్రధానంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ వినియోగం ఎక్కువ గా పెరిగిందని అన్నారు.ఇలాంటి క్రమంలో ఫోన్స్ పోతే చాలా మంది ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఎవరివైనా ఫోన్స్ పోయినట్లు అయితే కొనుగోలు చేసిన ఆధారాలతో పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే పైసా ఖర్చు లేకుండా మీ ఫోన్స్ ను ట్రాకింగ్ చేసి అవి ఎక్కడ ఉన్నాయో గుర్తించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Spread the love