నవతెలంగాణ – రామారెడ్డి
అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండల కేంద్రానికి చెందిన జాజ్ కోర్ బుచ్చయ్య (60) గత కొన్ని రోజుల క్రితం డ్రైనేజీ లో ప్రమాదవశాత్తు జారిపడి గాయాలు కావడంతో అనారోగ్యంతో బాధపడుతూ.. జీవితంపై విరక్తి చెంది ఇంట్లో దూలానికి నైలాన్ తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని రెండవ భార్య జాజి కోర్ భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ ఐ నరేష్ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్త కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.