నవతెలంగాణ – సిద్దిపేట
పట్టణ ప్రగతి సంబురాలలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేతుల మీదుగా లక్ష నుండి మూడు లక్షల జనాభా గల మున్సిపాలిటీలో సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణలో సిద్దిపేట బెస్ట్ మున్సిపాలిటీ గా ప్రథమ స్థానంలో నిలువగా, అవార్డును
మున్సిపల్ చైర్ పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు అందుకున్నారు. రాష్ట్రం లో ఎక్కడ లేని విధంగా స్వచ్ఛ బడిని నిర్వహిస్తున్న కౌన్సిలర్ దీప్తి నాగరాజు (39 వార్డు) ని శాలువాతో సన్మానించారు. బండి బాలవ్వ (పబ్లిక్ హెల్త్ వర్కర్) ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలిగా ప్రశంస పత్రం ,పట్టణప్రగతి అవార్డు, రూ 5000 నగదును కేటీఆర్ అందజేశారు.