ఇండియన్ ఐడల్ లో సత్తా చాటిన సిద్దిపేట బిడ్డ..

– సింగర్ గా తనదైన శైలిలో ప్రదర్శించి రెండవ రన్నర్ గా నిలిచిన లాస్య ప్రియ
– ట్విట్టర్ ద్వారా లాస్య ప్రియను అభినందించిన మంత్రి హరీశ్ రావు 
నవ తెలంగాణ – సిద్దిపేట 
సిద్దిపేట కు చెందిన గుమ్మన గారి లాస్య ప్రియ ఆహ అప్ లో జరిగిన ఇండియన్ ఐడల్ సీజన్ 2 లో రెండవ రన్నర్ గా నిలిచి తన సత్తా చాటుకుంది. మొదటి నుండి పట్టుదలతో తన సంగీత ప్రదర్శన చెస్తు ప్రేక్షకులకు అలరింపజేసింది. ప్రోగ్రాం జరుగుతున్న క్రమంలో మంత్రి హరీశ్ రావు  లాస్య ప్రియ కు తన ఆశీస్సులు తో స్పూర్తినిచ్చారు.  పట్టుదల తో లాస్య ప్రియ ఫైనల్ కు చేరి సీజన్ 2 లో రెండవ రన్నర్ గా నిలిచింది.  ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు  తన ట్విట్టర్ వేదికగా అభినందించారు. లాస్య ప్రియ తన సంగీత కళ తో  సిద్దిపేట కు, మీ తల్లి తండ్రుల కలను నిజం చేసిందన్నారు.  ఈ సందర్భంగా ఇండియన్ ఐడల్ తెలుగు -2023 సింగింగ్ కాంపిటీషన్ లో రన్నర్ అప్ గా నిలిచిన సిద్దిపేట ముద్దుబిడ్డ లాస్య ప్రియ కు హృదయ పూర్వక అభినందనలు, భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. తెలుగు సంగీతంలోని మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గాయకులందరికి గొప్ప భవిష్యత్ ఉండేలా దీవించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియ జేశారు.
Spread the love