కెనడాలో సిక్కు కుర్రాడిపై దాడి..

నవతెలంగాణ – కెనడా:  కెనడాలో ఓ బస్టాప్‌లో 17 ఏళ్ల సిక్కు కుర్రాడిపై దాడి జరిగింది. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో సోమవారం జరిగిన ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. బస్టాప్‌లో నిల్చున్న కుర్రాడితో వాగ్వివాదానికి దిగిన మరో కుర్రాడు ఆ తర్వాత అతడిపై పిడిగుద్దులు కురిపించాడు. ఆపై పెప్పర్ స్ప్రే చల్లినట్టు పోలీసులను ఉటంకిస్తూ స్థానిక న్యూస్ చానల్ పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇంతకుమించి వివరాలు వెల్లడించలేదు. అయితే కెనడాలోని వరల్డ్ సిక్కు ఆర్గనైజేషన్ మాత్రం స్టేట్‌మెంట్ విడుదల చేసింది. బస్టాప్‌ వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చారని, తొలుత బాధిత కుర్రాడిని బస్సు ఎక్కకుండా అడ్డుకున్నారని, బస్సు ఎక్కిన తర్వాత అతడిని బెదిరింపులకు గురిచేశారని పేర్కొంది. లైటర్‌తో బెదిరించడమే కాకుండా తమ ఫోన్లతో ఆ ఘటనను రికార్డు చేశారని తెలిపింది.

Spread the love