వెండితెరపై సిల్క్‌ స్మిత జీవితం

వెండితెరపై సిల్క్‌ స్మిత జీవితం80, 90వ దశకాల్లో గ్లామరస్‌ తారగా వెలుగొందారు సిల్క్‌ స్మిత. గ్లామరస్‌ పాత్రలు, పాటల్లో మెరిసిన ఆమె పీక్‌ పీరియడ్‌లో బిగ్గెస్ట్‌ క్రౌడ్‌-పుల్లర్‌గానూ అలరించారు. సిల్క్‌ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. ఆమె జయంతి పురస్కరించుకొని సిల్క్‌ స్మిత బయోపిక్‌ను అనౌన్స్‌ చేశారు దర్శకుడు జయరామ్‌. సిల్క్‌ స్మిత క్యారెక్టర్‌లో ‘వీరసింహారెడ్డి’ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌లో అలరించిన చంద్రిక రవి చేస్తున్నారు. ఎస్‌టిఆర్‌ఐ సినిమాస్‌ పై ఎస్‌ బి విజరు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వి.మహాస్త్రీ అమతరాజ్‌ సమర్పిస్తారు. సిల్క్‌ స్మిత కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో మేకర్స్‌ సిల్క్‌ స్మిత ‘ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ని ప్రపంచానికి చెప్పనున్నారు సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభమవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో వచ్చే ఏడాది ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

Spread the love