– పోస్టర్ ఆవిష్కరించిన బిఆర్ఎస్ నాయకులు
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
బి ఆర్ ఎస్ పార్టీ రజతో వేడుకలను విజయవంతం చేయాలని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజన్న అన్నారు. రజతోత్సవ వేడుకల చలో వరంగల్ వాల్ పోస్టర్ను తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఈనెల 27న బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వరంగల్లో ఏర్పాటు చేశారన్నారు. ఈ ఆవిర్భావ సభకు తంగళ్ళపల్లి మండలం నుండి 2000 మంది తరలి వెళ్లనున్నట్లు ఆయన వెల్లడించారు. కనీసం గ్రామానికి 50 మంది చొప్పున కార్యకర్తలు నాయకులు ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పడిగల మానస, సిరిసిల్ల, నేరెళ్ల ఫాక్స్ చైర్మన్ లు బండి దేవదాస్, కోడూరి భాస్కర్ గౌడ్, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగ్ మామిడి వెంకటరమణారెడ్డి,మాజీ సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు మాట్ల మధు, మండల అధ్యక్షులు వేణుగోపాలరావు, మాజీ సర్పంచ్,ఎసిరెడ్డి రామిరెడ్డి, రవీందర్,జగన్, నవీన్ రావు, ప్రేమ్, అంజయ్య గౌడ్ పాల్గొన్నారు.