ఏకకాలంలో రుణమాపిపై హర్షం

– సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం
నవతెలంగాణ-మల్హర్ రావు : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని,ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి,తెలంగాణ కాంగ్రెస్ మేనిపేస్టో చైర్మన్, రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబుల చిత్రపటాలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రమైన తాడిచెర్ల పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్లో చర్చించి రూ.31 వేల కోట్లు తెలంగాణ రైతాంగానికి ఏక కాలంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి సబ్ కమిటీ ఏర్పాటు చేసి విధివిధానాలతోటి ఆగస్టు 15వ తారీకు లోపల పూర్తి చేయనున్నట్లుగా తెలిపారు.తెలంగాణ రైతాంగం కళ్ళల్లో ఆనందం చూడడమే తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలన విధానమని, మరోసారి నిరూపణ చేసినందుకుగాను రైతుల పక్షాన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, వైస్ ఎంపిపి బడితేల స్వరూప రాజయ్య,ఎంపిటిసి ప్రకాష్ రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ ప్రకాష్ రావు, డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య,వొన్న తిరుపతి రావు, సంగ్గేం రమేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఐత రాజిరెడ్డి, మహిళ అధ్యక్షురాలు కొండ రాజమ్మ,యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి, నాయకులు అశోక్ రావు,బండి రాజయ్య,మేనం సతీష్,బండి స్వామి,తిర్రి సమ్మయ్య,కిషన్ నాయక్,కేశారపు చెంద్రయ్య, మధు,రాగం ఐలయ్య, మహేందర్, సురేందర్, దుర్గాప్రసాద్,నర్సింగరావు,సమ్మయ్య పాల్గొన్నారు.
Spread the love