విశ్వంభరతో విశ్వవ్యాప్తం చేసిన సినారె.. 

– తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ రూరల్
విశ్వంభరతో విశ్వవ్యాప్తం చేసిన సినారె.. తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,సాహితీ సౌరభాలను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు సినారె అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం వేములవాడ రూరల్ మండలం హన్మజీపేట గ్రామంలోని శ్రీమతి సుశిలా నారాయణరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కవితా కర్పూర క్షేత్రంలో మహాకవి జ్ఞానపిఠ  పురస్కార గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సినారే ) వర్ధంతి వేడుకల్లో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. సినారె స్మృతి స్థలిపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ సాహితీ సౌరభాలను విశ్వంభరతో విశ్వవ్యాప్తం చేసి, తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత, ఆచార్య డాక్టర్‌ సినారె (సింగిరెడ్డి నారాయణరెడ్డి) అని కొనియాడారు. కవిగా,రచయితగా, గేయ కావ్య కృతికర్తగా, పరిశోధకుడిగా, విద్యావేత్తగా, సినీ గీతాల రచయితగా తనదైన శైలిలో  పద సోయగాలను ఒలికిస్తూ సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించిన సృజనకారుడు సినారె అని తెలిపారు. ఆ మహనీయుడు మన ప్రాంతానికి చెందిన వాడు కావడం మనకు చాలా గర్వకారణం అన్నారు. కవులకు, కళాకారులకు ఎల్లలు లేవన్నట్లుగా సినారెకు మరణం లేదన్నారు.
మన ప్రాంతం గురించి వారు పాటల రూపంలో మన ప్రాంతం గొప్పదనాన్ని వివరించడం చాలా ఆనందదాయకమన్నారు.ఆ కాలంలో  సినారె నుంచి స్ఫూర్తి పొంది ప్రజా జీవితంలో అనేక హోదాల్లో సేవలందిస్తూ పైకి వచ్చానని, వారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు సినారె అందించిన అభివృద్ధి నిధులతో అనేక గ్రామాలకు తాగునీటికి బోరుబావులు ఏర్పాటు చేశానని తెలిపారు.  కావ్యాల ద్వారా, వేలాది సినీ గీతాల ద్వారా మానవ జీవితంలోని అన్ని దశలను, అన్ని వయస్సుల వారిని అలరింప చేయటంతో పాటు ఆలోచింపజేశారని అన్నారు.సినారె కు ప్రభుత్వ పరంగా జయంతి,వర్ధంతి వేడుకలు ,ట్యాంకు బండ్ పై వారి ప్రతిమలు ఏర్పాటుకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాన్నారు.రానున్ను రోజుల్లో వారి గౌరవాన్ని పెంచే విధంగా కార్యక్రమంలు చేపడతమన్నారు. సినారె కు దేశంపై ఉన్న ప్రేమకు వారి పిల్లలకు పెట్టిన పేర్లే నిదర్శనం అన్నారు.ఆ మహనీయులని గౌరవించుకోవడం ఈ ప్రాంత బిడ్డలుగా మనకు గర్వకారణం అన్నారు.వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love