– బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం
నవతెలంగాణ – సిద్దిపేట
తెలుగు సాహిత్యంలో చెదరని ముద్ర వేసి, సాహితీ సంపద సృష్టించిన నాటి జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి చిరస్మరణీయులని, తెలుగు సాహిత్యంలో సినారె రచనలు అమోఘమని బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం అన్నారు. సినారె జయంతి సందర్భంగా సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో సినారె చిత్రపటానికి పూలమాలవేసి, ఆయన మాట్లాడుతూ పద్యం, కథ, కవిత్వం, గజల్ పలు ప్రక్రియలలో రచనలు చేయడంతో పాటుగా, ఇటు సాహిత్యంలోనూ అటు సినీ రంగంలోనూ పేరుప్రఖ్యాతులు గాంచిన సినారె యువతకు స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. పలు భాషలలో నిష్ణాతులైన, రాజ్యసభ సభ్యులుగా సేవలందించి ఖ్యాతి నొందారన్నారు. సినారెతో సిద్ధిపేట కవులకు గల అనుబంధాన్ని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కవులు బస్వ రాజ్ కుమార్, కోణం పర్శరాములు, పెందోట వెంకటేశ్వర్లు, శ్రీచరణ్ సాయిదాస్, యాడవరం చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.