సింగంపల్లి ‘ఎరుపు’ కవితలు

Singampally's 'Red' Poemsఅశోక్‌ కుమార్‌ సింగంపల్లి తన 75వ వజ్రోత్సవ సందర్భంగా ఇరవై సంవత్సరాలు తాను వెలువరించిన కవితా సంపుటాల్లోంచి ఎంపిక చేసుకున్న కవితా సంపుటే ఎరుపు. 75 కవితలున్నాయి ఈ సంపుటిలో పెన్ను, గన్ను పట్టిన పాణిగ్రాహి సుబ్బారావుకు ఈ కవితాసంపుటి అంకితం చేశారు కవి. అన్ని కవితలూ ప్రగతిశీలంగా, సామ్యవాద కాంక్షతో కూడినవే! 25 కవితా సంపుటాలు, 6 శ్రీశ్రీ సాహిత్య నిధి ప్రచురణలు చేశారు కవి. ‘పెన్ను నువ్వు, గన్ను నువ్వు, ఎరుపెక్కిన కన్ను నువ్వు, దిక్కు మొక్కు లేని జనం, ప్రతి ఒక్కరి దన్ను నువ్వు’ అంటూ ‘ఎరుపు’ (శీర్షిక కవిత) లోని నివాళిని ఆర్పిస్తూ కవితలు ఆరంభం అవుతాయి. సర్వజిత్‌తో కవి ఇంటర్వ్యూ బాగుంది. అద్దేపల్లి రామమోహనరావు, త్రిపురనేని మధుసూదనరావుల నుండి ఎంతో (నేర్చాను). ఎన్నో చిక్కుముడులు విప్పుకున్నాను అనడం బాగుంది. వీరు శ్రీశ్రీ సాహిత్య నిధి ప్రచురణలు చేశారు, చేస్తున్నారు. వెంటాడే అద్భుతాలు మచ్చుకు కొన్నింటిని చూద్దాం.
– ఎర్రజెండా దేశం మీద మెరిస్తే ఆ పోరుగడ్డకు చావు లేదని! దేహం మీద పరిస్తే ఆ వీరబిడ్డడు చావలేదని! (2015) ఎర్రజెండాలో అన్నారు (పేజీ 13).
– పెట్టుబడి రంగు, రుచి, వాసన గుట్టు విప్పిన పరీక్ష నాళిక అంటారు కమ్యూనిస్ట్‌ ప్రణాళిక కవితలో (శతఘ్ని -2023).
– ‘ఆశయకేతనం’ కవితలలో (వ్యూహం – 2006) అద్భుత భావ సంఘర్షణతో ఇలా రాశారు. ”దేశాలను తెలిపేది ఎగిరే జెండా! – దేశాలను కలిపేది ఎర్రజెండా! (పేజీ 15) అంటారు కవి.
– ‘నేల మీద పారాడినప్పుడు కాదు, నేలకోసం పోరాడిప్పుడు’ అంటూ కర్తవ్యాన్ని బోధచేస్తారు ‘పుడమితల్లికి పుత్రోత్సాహం’ కవితలో (పేజీ 22) కవి అశోక్‌ కుమార్‌. యుద్ధం, కమ్యూనిస్ట్‌, శ్రమరం, పోలీసు లాఠీ, రెండూ తుపాకులే, గ్లోబల్‌, అమెరికీయం, చెప్పులున్నాయి జాగ్రత్త, సంపద, మహిలో, కార్పొరేట్‌ టెస్టులు… లాంటి కవితలు మన జీవిత, జీవన సారాన్ని అద్భుతంగా ‘కోడ్స్‌’లా అక్షరీకరించిన ‘అసి’ అబినందనీయులు.
తంగిరాల చక్రవర్తి 

Spread the love