వరద బాధితులకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భూపాలపల్లి వారు చేయూత

– నిత్యవసర సరుకులు, నగదు అందుచేత
నవతెలంగాణ – తాడ్వాయి
ఇటీవల విస్తారం కురుస్తున్న వర్షాలకు జంపన వాగు ఉగ్రరూపానికి నిస్సహాయులైన ఊరటం వరద బాధితులకు ములుగు ఎమ్మెల్యే సీతక్క పిలుపుమేరకు శుక్రవారం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భూపాలపల్లి వారు నిత్యవసర సరుకులు, ఒక్క కుటుంబానికి రూ. 500 చొప్పున నగదు అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ములుగు ఎమ్మెల్యే సీతక్క వరద బాధితులకు సహాయం అందించండి అని పిలుపు ఇవ్వడంతో వారి అభిమానంతో ఈ సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారు. వరద బాధితులకు మా చిన్న సహాయం అని తెలిపారు. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే వరద బాధితులకు వారి వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూపాల్ పల్లి ఏరియా సేవ అధ్యక్షురాలు మాధవి, శ్రీనివాసరావు, లేడీస్ క్లబ్ సెక్రెటరీ మనీ భాను ప్రసాద్, సేవా సెక్రెటరీ లక్ష్మీ, డివైపిఎం బి శ్యాంప్రసాద్, కోఆర్డినేటర్ ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ తాడ్వాయి మండల అధ్యక్షులు బోల్లు దేవేందర్ ముదిరాజ్, స్థానిక సర్పంచ్ గొంది శ్రీధర్, తాడ్వాయి సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, సహకార సంఘం మాజీ చైర్మన్ పాక సాంబయ్య, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పీరిల వెంకన్న, సీతక్క యువసేన జిల్లా అధ్యక్షులు చర్ప రవీందర్, సేవా బృందం, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love