లోన్ యాప్ వేధింపులకు సింగరేణి ఉద్యోగి బలి

నవతెలంగాణ – పెద్దపల్లి టౌన్
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల వల్ల యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొల్లూరు గ్రామానికి చెందిన వంశీకృష్ణ సింగరేణిలో ఉద్యోగం చేస్తూ పెద్దపల్లిలో నివాసం ఉంటున్నాడు. ఆర్థిక అవసరాల నేపథ్యంలో ఆన్ లైన్ యాప్ ద్వారా రుణం తీసుకొని ఇప్పటికే రూ.రెండున్నర లక్షలు చెల్లించినా, లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో యాప్ లోన్ నిర్వహకుల వేధింపులు తాళలేక గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల వల్లే వంశీకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపించారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పెద్దపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Spread the love