టీఈటీ ఫలితాలలో జిల్లా టాపర్ గా సింగరేణి కార్మికుని కూతురు 

నవతెలంగాణ-యైటింక్లయిన్ కాలనీ: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి.ఈ టెట్ ఫలితాల్లో రామగుండం మండలం పోతన కాలనీకి చెందిన సింగరేణి కార్మికుని కూతురు నేదురు రమ్య పెద్దపల్లి జిల్లా టాపర్ గా నిలిచింది.ఇప్పుడు ఎల్ఎల్బీ తృతీయ సంవత్సరం చదువుతున్న రమ్య ఓవరాల్131/150 సాదించింది. తల్లి దండ్రుల ప్రోత్సాహం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాదించడమే తన లక్ష్యమని ఆమె తెలిపింది.ప్రభుత్వ ఉపాధ్యాయులుగా  నియమితులు కావాలంటే టెట్‌లో క్వాలిఫై కావడం తప్పనిసరి. టెట్‌ పేపర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు, పేపర్‌ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు.

Spread the love