– బాబుక్యాంపులో క్వార్టర్స్.. ఖాళీ స్థలం ఆక్రమణ
– యధేశ్చగా నిర్మాణాలు
– అడ్డుకున్న సింగరేణి ఎస్టేట్ అధికారులు
– ఖాళీ స్థలాల్లో సంస్థ హెచ్చరిక బోర్డులు
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెంలో సింగరేణి సంస్థ ఖాళీ స్థలం కనిపిస్తే నాయకులు కబ్జాలు చేస్తున్నారు. ఎక్కడ ఖాళీ స్థలం దొరకని వారు ఏకంగా సింగరేణి క్వార్టర్స్‌నే అక్రమించుకుంటున్నారు. సింగరేణ సంస్థ వంద సంవత్సరాల లీజు ముగిసిన నేపద్యంలో కొంత భాగం భూమిని సింగరేణి యాజమాన్యం ప్రభుత్వానికి అప్పగించిన నేపద్యంలో అక్రమణకు గురవుతున్నట్లు తెలుస్తుంది. దీన్ని అదునుగా భావించి కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో ఎక్కడా చూసినా ఇదే పరిస్ధితి కనిపిస్తుంది. బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులే అక్రమణకు తెరతీశారని, ఏకంగా 176 జివో కింద పట్టా కూడా చేయించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. పట్ట అయిన వెంటనే అమ్మకాలు చేస్తున్నారు. ఇదే తరహాలో చుంచుపల్లి మండలంలోని బాబుక్యాంపులో చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌కు అనుకుని ఉన్న, ఖమ్మం ప్రధాన రహదారికి పక్కనే ఉన్న సింగరేణి క్వార్టర్‌ను ఉద్యోగి కబ్జాచేశారని యాజమాన్యానికి ఫిర్యాదు అందింది. దీంతో సింగరేణి ఎస్టేట్ విభాగాం అధికారులు కబ్జాకు గురవుతున్న ప్రాంతాన్ని సందర్శించి ఆవాక్కయ్యారు. కార్మికుడి నివాసం ఉన్న ఇంటి భాగాన్ని కుదించి, మరో నిర్మాణానికి పూనుకున్నారు. గతంలో పక్కనే నిరుపయోగంగా ఉన్న సింగరేణి సంస్థ వినియోగించిన ఇంటిని సైతం కబ్జా చేశారని, దానికి పంచాయతీ నుండి ఇంటి నెంబర్ తీసుకున్నారని ఎస్టేట్ అధికారులు గుర్తించారు. సింగరేణిలో ఉద్యోగిగా చేస్తున్న కార్మిక సంఘం నాయకుడే ఆక్రమణకు పాల్పడుతున్నాడని ఏస్టేట్ అధికారులు గుర్తించారు. ఇదే తరహాలో కూలీ లైన్ రైతు బజార్ పరిధిలో ఉన్న సింగరేణి కాళీ స్థలాలను ఆక్రమిస్తున్నారు. అధికారులు రాజకీయ పార్టీల నాయకులు అసెంబ్లీ ఎన్నికల సందడిలో ఉంటే ఇదే అదునుగా భావించిన భూ కబ్జా మాఫియా బరితెగించి సింగరేణి ఆస్తులపై ఎగబడ్డారని జిల్లా కేంద్రంలో చర్చ నియాంశంగా మారింది. ఈ నిర్మాణాలపై ఆరా తీయగా ఇది సింగరేణి స్థలమని తెలియడంతో వెంటనే ఎస్టేట్ అధికారులు స్పందించి నిర్మాణ పనులను అడ్డుకోవడం జరిగింది. వెంటనే ఈ స్థలంలో సింగరేణి ఎస్టేట్ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు.