రెండు కార్లు ఢీ.. సింగరేణి కార్మికుడు మృతి

నవతెలంగాణ – వరంగల్: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాటారం మండలం మేడిపల్లి అటవీ ప్రాంతంలో ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.  మృతుడిని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సింగరేణి రిటైర్డ్‌ కార్మికుడు బొంకూరి నర్సయ్యగా గుర్తించారు. కాగా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love