సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలి

– కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలపై అలుపెరుగని పోరాటాలు
– రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద
నవతెలంగాణ-మణుగూరు
ప్రతి సింగరేణి కార్మికుడికి 250 గజాల ఇంటి స్థలం డబల్‌ బెడ్రూం కట్టించి సొంతింటి కల నెరవేర్చాలని, కాంట్రాక్ట్‌ కార్మిక సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించాలని సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు పిలుపునిచ్చారు. పీవీ కాలనీ యూనియన్‌ కార్యాలయంలో మణుగూరు ఏరియా 12వ మహాసభ టీవీ ఎం.వి ప్రసాద రావు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ మహాసభలో పాల్గొని మాట్లాడుతూ కార్మికులకు ఆపద వస్తే ముందుండే సీఐటీయూని కార్మికులు ఆదరించాలని పిలుపునిచ్చారు. మణుగూరు ఏరియాలో ఉపరితల గనులకు మనుగడ లేదని అన్నారు. భూగర్భ గనులను ప్రారంభించి మణుగూరు సింగరేణి మనగడ కాపాడాలన్నారు. మణుగూరు ఏరియాలో క్వార్టర్‌ సమస్య తీవ్రంగా ఉందన్నారు. స్థానిక సమస్యలపై పోరాటాలు నిర్వహించాలన్నారు. నిజాయితీగల నాయకులు, కార్యకర్తలు సీఐటీయూ ఆస్తి అన్నారు. సింగరేణి కార్మికులు చార్ట్‌ సీట్‌కు సమాధానం ఇస్తే ప్రమాదంలో పడినట్లే అన్నారు. ఇంక్రిమెంట్‌ రద్దు అయితాయని అన్నారు. సింగరేణి వ్యాప్తంగా 65శాతం పైగా కాంట్రాక్ట్‌ కార్మికులు సింగరేణిలో పనిచేస్తున్నారన్నారు. కాంట్రాక్ట్‌ కార్మికుల వలనే కంపెనీకి లాభాలు వస్తున్నాయి అన్నారు. యాజమాన్యం కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. లాభాలు, బోనస్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు సరైనా మస్టర్లు ఇవ్వక యాజమాన్యం శ్రమ దోపిడీ చేస్తుందన్నారు. సీఎం పిఎఫ్‌ పెన్షన్‌ సౌకర్యం లేని కారణంగా సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికులు తీవ్ర నష్టానికి గురవుతున్నారని అన్నారు. సింగరేణి క్వాటర్స్‌లను ప్రభుత్వ అధికారులకు ఇస్తున్నారని అన్నారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఈ సమావేశంలో సీనియర్‌ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, గద్దల శ్రీనివాసరావు, సిఐటియు మండల కన్వీనర్‌ ఉప్పుతల నరసింహారావు, సత్రపల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
అధ్యక్ష కార్యదర్శులుగా టివి ఎం.వి ప్రసాద రావు, వల్లూరు వెంకటరత్నం
సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) 12 మహాసభ నూతన బ్రాంచ్‌ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. పివి కాలనీలో జరిగిన మహాసభలో 21 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేస్‌ బోర్డు సభ్యులు మందనరసింహారావు పాల్గొన్నారు. గౌరవాధ్యక్షులుగా నెల్లూరి నాగేశ్వరరావు, అధ్యక్షులుగా టీవీ ఎన్‌ వి ప్రసాద రావు, ఉపాధ్యక్షులుగా మాచారపు లక్ష్మణరావు, వై.రామ్మూర్తి, బొల్లం రాజు, తాతిని లక్ష్మణరావు, బ్రాంచి కార్యదర్శిగా వల్లూరి వెంకటరత్నం, సహాయ కార్యదర్శులుగా సత్రపల్లి సాంబశివరావు. ఎన్‌.విల్సన్‌ రాజు, తాళ్లూరి ప్రభాకర్‌, ఎం.సుమన్‌, ఎం.బిక్షపతి, బ్రాంచ్‌ ట్రజరర్‌గా నంద ఈశ్వరరావు, బ్రాంచ్‌ కార్యవర్గ సభ్యులుగా పారుపల్లి వెంకటేశ్వర్లు, వై.బుచ్చిరెడ్డి, ఆర్‌.మధుసూదన్‌ రావు, కే.శ్రీనివాస్‌, ఎండి ముజఫర్‌, సిహెచ్‌ వినోద్‌, శివకుమార్‌, భద్రయ్యలను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది.

Spread the love