సింగిల్‌ క్యారెక్టర్‌.. సింగిల్‌ షాట్‌

సింగిల్‌ క్యారెక్టర్‌.. సింగిల్‌ షాట్‌హన్సిక హీరోయిన్‌గా రాజు దుస్స దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘105 మినిట్స్‌’. రుద్రాంశ్‌ సెల్యులాయిడ్స్‌, మాంక్‌ ఫిలిమ్స్‌ పతాకాలపై బొమ్మ కె శివ నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సింగిల్‌ షాట్‌ సింగిల్‌ క్యారెక్టర్‌ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ దర్శకుడు అజరు భూపతి రిలీజ్‌ చేశారు. ఈ మోషన్‌ పోస్టర్‌లో రక్తపు గాయాలతో కుర్చీలో కూర్చున్న హన్సిక ఒక ఇంటెన్సిఫైడ్‌ లుక్‌తో కనిపిస్తుంది. శ్యాం సి యస్‌ సంగీతాన్ని అందించారు. రిలీజ్‌ అయిన మోషన్‌ పోస్టర్‌ మూవీ పైన అంచనాలను పెంచేస్తోంది. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ రోల్‌ అందులోనూ ఇలాంటి ఒక డిఫరెంట్‌ రోల్‌ చేయడం హన్సికకి ఇదే మొదటిసారి.
మాంక్‌, పనోరమ స్టూడియోస్‌ సంయుక్తంగా డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్న ఈ సినిమా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Spread the love