శిరీష బావ అనిలే నిందితుడు

నవతెలంగాణ-పరిగి
మండల పరిధిలోని కాడ్లాపూర్‌కు చెందిన జుట్టు శిరీష(18) హత్య చేసిన నిందితుడు అనిల్‌ను బుధవారం పరిగి పోలీసులు రిమాండ్‌ తరలిం చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. మండల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల కాడ్లాపూర్‌కు చెందిన జుట్టు శిరీష (18) అమ్మాయి హత్య చేసి, నీళ్లకుంటలో పడేశారని మతురాలి అన్న శ్రీకాంత్‌ ఈనెల 11వ తేదీ పరిగి పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే రోజు ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌ 134 /2023 యు/ఎస్‌ 302 ఐపిసి కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ కేసును సీరియస్‌గా తీసుకొని 2 రోజుల్లో ఛేదించారు. శిరీష అక్క భర్త పరిగి, బహార్‌ పేట్‌కు చెందిన ఎర్రగడ్డపల్లి అనిల్‌ను విచారించగా తానే ఈ నేరాన్ని చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు సంవత్సరం నుండి అతడి మరదలును శారీరకంగా అను భవించాలనే కోరికతో ఉన్నాడు. ఆమె నర్సింగ్‌ పని చేస్తూ వికారాబాద్‌లో ఉంటూ ఈ మధ్యనే ఊరికి వచ్చినందున ఆమెను శారీరకంగా కలవడానికి వీలు లేకపోయేది. దాంతో సరైన అవకాశం కోసం ఎదురు చూసేవాడు. కానీ మతురాలు వేరే అబ్బాయితో ఫోన్‌లో మాటా డుతుందనే అనుమానం కలగడంతో తనతో మాట్లాడకుండా వేరే వాడితో మాట్లా డుతుందా అని ఆమె మీద కోపం పెంచుకున్నాడు. వేరే వాడితో మాట్లాడుతుందనే అక్కసుతో దీనిని ఎలాగైన చంపాలని ఒంటరిగా ఉన్న ఆమెను చేతులతో అక్కడే ఉన్న కర్రతో ఆమెను ఎక్కడపడితే అక్కడ కొట్టుకుంటూ పక్కనే ఉన్న నీటి కుంట దగ్గరికి తీసు కువెళ్లి పగిలిన ఖాళీ బీరు సీసాతో ఆమె కళ్ళల్లో పొడిచి ఆ సీసాను కుంటలో పడేశాడు. నీళ్ళ లోపలికి నెట్టి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత కుంటలో కాళ్ళు చేతులు కడుక్కుని తిరిగి బైక్‌ మీద ఒక్కడే పరిగికి వెళ్లిపోయాడు. బుధవారం విశ్వ సనీయ సమాచారం మేరకు నిందితుడిని పట్టుకుని విచారించగా అతడు నేరాన్ని చేసినట్లు ఒప్పు కున్నాడు, నిందితుడి బైకును, ఫోను స్వాధీనం చేసుకొని రిమాండ్‌ చేశామన్నారు. ఈ కేసులో బలమైన సైంటిఫిక్‌, టెక్నికల్‌,ఇతర సాక్ష్యాలు సేకరించారు. నేరస్తునికి చట్ట పరంగా కఠిన శిక్ష పడేటట్లు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్ట్‌ ఏర్పాటు చేస్తామని, నిందితుడు పై గతంలో కూ డా కేసులు ఉన్నాయన్నారు. కేసు ఛేదించినందుకు డిఎస్పి కర్ణ సాగర్‌ రెడ్డిని, సీఐ వెంకటరామయ్యను, ఎస్సై విఠల్‌ రెడ్డిని అభినందించారు.

Spread the love