– ఆపిన పెద్దల విద్యుత్ బకాయి వసూలు
– నేతల ఒత్తిడే కారణమా..?
– బకాయి వసూళ్లలో పేదలపై సెస్ జులుం
నవతెలంగాణ – సిరిసిల్ల
ప్రభుత్వాలు మారిన పేద ప్రజల విద్యుత్తు బకాయిలపై ఒత్తిడి మాత్రం ఆగటం లేదు. కానీ ఇది పెద్దలకు మాత్రం వర్తించడం లేదు. పేద మధ్యతరగతి ప్రజలపై బకాయి ఉన్న విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్న అధికారులు పెద్దలపై మాత్రం దృష్టి సారించడం లేదు. వందల రూపాయలు విద్యుత్ బకాయి ఉంటేనే ఇంటికి సంబంధించిన విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్న అధికారులు కోట్లు బకాయిలు ఉన్న పెద్దలపై ఎందుకు అంత ప్రేమ చూపుతున్నారనేది తెలియడం లేదు. నేతల ఒత్తిడి పై పెద్దలకు సంబంధించిన విద్యుత్ బకాయిల వసూళ్లను సెస్ అధికారులు ఆపివేశారు. దీంతో సెస్ సంస్థ నష్టాల్లో కూరుకుపోతుంది .ప్రజల భాగస్వామ్యంతో నడుస్తున్న విద్యుత్ సంస్థ నష్టాల్లోకి తీసుకు వెళ్లడానికి కొంతమంది అధికారులు కారణంగా కనిపిస్తుంది. దేశంలోనే ఏకైక సహకార విద్యుత్ సరఫరా సంస్థ సిరిసిల్లలో ఉంది. ఆ సహకార సంస్థను గత పాలకవర్గం కొంతమంది ఉద్యోగులతో కలిసి వస్త్ర వ్యాపారులకు లాభం చేస్తూ ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం మోపుతూ సంస్థను జీవచ్చవంలా చేసింది. ఎవరో ఓ 20 మంది పెద్దలు చేసిన పాపానికి లక్షల మంది ఎందుకు నష్టపోవాలని సెస్ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు దానికి సమాధానం సెస్ పాలకవర్గం చెబుతుందా సెస్ అధికారులు చెబుతారా లేదా ఈ పెద్దల మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తున్న నేతలు చెబుతారా అని విద్యుత్ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఎస్ ఎస్ ఐ యూనిట్లు సిరిసిల్లలో బతుకమ్మ చీరల కోసం ఏర్పాటు కాగా అవి వస్త్ర వ్యాపారుల గుప్పిట్లో బందీగా మారాయి.
పట్టించుకోని విద్యుత్ అధికారులు..
పదివేల విద్యుత్ బిల్లు బకాయి ఉంటేనే విద్యుత్ సిబ్బంది ఆ పేదల ఇంటికి వెళ్లి హల్చల్ చేస్తారు కోట్ల రూపాయల విద్యుత్ బకాయి ఉంటే అదే సిబ్బంది వారి ఇండ్లకు వెళ్లి బ్రతిమిలాడుతారు ఇది సిరిసిల్ల సెస్ ఉద్యోగుల తీరు పాలకవర్గం కూడా తమకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తుంది సెస్ ఉద్యోగులే వస్త్ర వ్యాపారులకు విద్యుత్ చౌర్యంలో అండగా నిలిచారు సిరిసిల్లలోని 127 ఎస్ఎస్ఐ యూనిట్లు బతుకమ్మ చీరల తయారీ కోసం ఏర్పాటు చేసుకున్నారు దీనికి సంబంధించి కార్మికుల కోసం అప్పటి ప్రభుత్వం బతుకమ్మ చీరలను తయారీ సిరిసిల్లకు కేటాయించింది అంతేకాకుండా తయారీకి సంబంధించిన విద్యుత్తు 50 శాతం సబ్సిడీని ప్రభుత్వమిచ్చింది కానీ ఇక్కడ కొంతమంది వస్త్ర వ్యాపారులు ముఠాగా ఏర్పడి విద్యుత్తు చౌర్యానికి పాల్పడినట్లు తెలిసింది మూడవ కేటగిరికి యూనిట్ కు 7.40 పైసలు కాగా నాలుగవ కేటగిరికి యూనిట్ కు 4 రూపాయలు చెల్లించాలి మూడవ కేటగిరి కి సబ్సిడీ వర్తించదు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చట్టం ప్రకారం ఆన్లైన్ లైసెన్సు పొంది సర్టిఫికెట్ ఉన్న వారికే ఈ సబ్సిడీ వర్తిస్తుంది సిరిసిల్లకు చెందిన చిమ్మని ప్రకాష్ అనే వ్యక్తి 2021లో సబ్సిడీ ఎస్ఎస్ఐ యూనిట్లకు వర్తించదని సహకార విద్యుత్ శాఖను మోసం చేస్తున్నారని దీంతో విద్యుత్ వినియోగదారులు నష్టపోతున్నారని ఆయన ఈ ఆర్ సి కి వెళ్ళాడు వారు పట్టించుకోకపోవడంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంకు వెళ్లి పిటిషన్ దాఖలు చేశారు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పందించి ఎస్ ఎస్ ఐ యూనిట్ల కు సంబంధించి మూడవ కేటగిరీలోనే ఉండేలా చూడాలని 2016 నుంచి సబ్సిడీ పొందిన విద్యుత్ బిల్లులను తిరిగి కట్టించుకోవాలని 2023లో సెస్ ను ఆదేశించింది సెస్ అధికారులు వస్త్ర వ్యాపారులు సబ్సిడీ పొందిన డబ్బులు 18 కోట్లను వెంటనే చెల్లించాలని నోటీసులు జారీ చేశారు దీంతో వస్త్ర వ్యాపారులు 9 మంది న్యాయస్థానంకు వెళ్లారు ఈ తొమ్మిది మందికి కేసు పూర్తయ్యే వరకు విద్యుత్ తొలగించవద్దని న్యాయస్థానం ఆదేశించింది
నేతలు చెబితే ఆగిన వసూలు.. నష్టాల్లో సెస్
లక్షల రూపాయలు విద్యుత్ బకాయి ఉండగా నేతలు చెబితే ఆ బకాయి వసూలు ఆగిపోయాయి దీంతో సెస్ నష్టాల్లో కూరుకు పోతుంది సిరిసిల్లలోని ఎస్ ఎస్ ఐ యూనిట్ లు తమ గుప్పిట్లో నడుస్తున్న వస్త్ర వ్యాపారులు ఏడాది నుంచి అసలే విద్యుత్ బిల్లులు కట్టడం లేదు ప్రతి నెల 50 లక్షలు సెస్ కు చెల్లించాలి ఇప్పటివరకు 8కోట్ల వరకు బకాయి అలాగే ఉంది దీనికి ముందు సెస్ ను మోసం చేసినట్లు గుర్తించి 18 కోట్లు ఎస్ఎస్ఐ యూనిట్ల నుండి రావాల్సి ఉందని నోటీసులు జారీ చేయగా మొత్తం ఇప్పటివరకు సెస్ కు సుమారు 26 కోట్ల బకాయి ఎస్ ఎస్ ఐ యూనిట్ ల నుంచి రావాలి ఈ బకాయి ఎస్ఎస్ఐ యూనిట్ల యజమానులు చెల్లించక పోగా సెస్ అధికారులు వారి వద్ద నుంచి వసూలు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని విద్యుత్ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు ఇది ఇలా ఉండగా పాలకవర్గం ఇలాంటి వాటిపై దృష్టి ఎందుకు పెట్టడం లేదని విద్యుత్ వినియోగదారుల్లో ప్రశ్నగా మిగిలింది ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసి పదివేలు విద్యుత్ బకాయి ఉంటేనే సెస్ ఉద్యోగులు నానా రభస చేస్తుండగా ఆ ఇంటి యజమానులు కాళ్లావేళ్లపడ్డ పట్టించుకోకుండా విద్యుత్తు కట్ చేస్తున్నారు పాలకవర్గం పారదర్శకమైన పాలన అందించినట్లయితే అధికారులు అవినీతిరహిత విధులు నిర్వర్తించినట్లయితే ముందుగా ఈ కోట్ల బకాయిలను వసూల్ చేయాల్సిన అవసరం ఉందని విద్యుత్ వినియోగదారులు పేర్కొంటున్నారు . తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి గతంలోనే ఎస్ ఎస్ ఐ యూనిట్ల నుంచి విద్యుత్తు బకాయి డబ్బులను వసూలు చేయాలని సెస్ అప్పటి ఎండి రామకృష్ణ ను ఆదేశించగా ఆయన వారి ఆదేశాలను పట్టించుకోకపోవడంతో విద్యుత్ నియంత్రణ మండలి ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనకు 25 వేలు జరిమాన విధించి కట్టించుకుంది ఇప్పటికైనా సెస్ అధికారులు నిద్రలో నుంచి బయటకు రాకపోతే వారిపై కూడా విద్యుత్ నియంత్రణ మండలి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.