చౌటుప్పల్ రూరల్ సీఐ ను సన్మానించిన ఎస్ఐలు

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ రూరల్ సీఐగా వచ్చిన ఏ.రాములను సబ్ ఇన్స్పెక్టర్లు బుధవారం ఘనంగా బొకేలతో సన్మానించారు. సీఐ ఏ.రాములు సబ్ ఇన్స్పెక్టర్లతో మాట్లాడుతూ.. శాంతిభద్రతలో, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థాన్ నారాయణపురం, భూదాన్ పోచంపల్లి మండలాల సబ్ ఇన్స్పెక్టర్లు H.రాఘవేందర్ డి.సురేష్ రైటర్ రాజశేఖర్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love