
ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. ఇందులో భాగంగా అశ్వారావుపేటకు బదిలీ పై వచ్చిన ఎస్.హెచ్.ఒ 1ఎస్.ఐ గా శ్రీకాంత్, ఎస్.హెచ్.ఒ 2 ఎస్.ఐగా శివ రామక్రిష్ణలు సోమ, ఆదివారాల్లో ఇక్కడ విధులు చేపట్టారు. ఇక్కడ ఎస్.హెచ్.ఒ బి.రాజేష్ కుమార్ మణుగూరు బదిలీ అయ్యారు. భద్రాచలం టౌన్ ఎస్.ఐగా పని చేసిన శ్రీకాంత్, కొమరారం ఎస్.ఐగా పనిచేసిన శివ రామక్రిష్ణ అశ్వారావుపేట కు బదిలీపై వచ్చారు.