చెల్లెలిపై అన్న కత్తితో దాడి

– మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రి కి తరలింపు
నవతెలంగాణ – అచ్చంపేట
ప్రేమించి పెళ్లి చేసుకుందని చెల్లెలుపై అన్న కత్తితో దాడి చేసినా ఘటన  అచ్చంపేట మండలం గుంపన పల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.  వివరాల ప్రకారం చెల్లెలు, చెంచు పలుగు తండాకు చెందిన ఓ  యువకుడిని   ప్రేమించి పెళ్లి చేసుకుందని, ఆగ్రహంతో అన్న చెల్లెలిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ అమ్మాయిని అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అన్న అఖిల్ పరార్ లో ఉన్నట్లు  పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అచ్చం పేట ఎస్సై రాము తెలిపారు.
Spread the love