పేపర్ లీకేజీ కేసులో దూకుడు పెంచిన సిట్..

నవతెలంగాణ – హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో అభియోగపత్రం దాఖలు చేయనున్నారు. 37 మంది నిందితులను అభియోగపత్రంలో చేర్చనున్నారు. న్యాయసలహా తీసుకొని వచ్చే వారంలో అభియోగపత్రం దాఖలు చేసే యోచనలో ఉంది. ఇప్పటి వరకు 50 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇందులో 15 మంది నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డితో పాటు మిగతా నిందితులంతా జైల్లోనే ఉన్నారు. అనుబంధ ఛార్జ్‌షీట్‌లో మిగతా నిందితులను చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పూల రమేష్ అరెస్ట్‌తో ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు కొత్త మలుపు తిరిగింది. పూల రమేషే హైటెక్ మాస్ కాపీయింగ్ చేయించినట్లుగా గుర్తించారు. ఏఈ ప్రశ్నాపత్రాన్ని దాదాపు 80 మందికి పూల రమేష్ విక్రయించాడు. ఇతని నుంచి రాబట్టిన కీలక సమాచారంతో అరెస్ట్‌ల సంఖ్య మరింత పెరిగే అవకాశ ఉంది.

Spread the love