– జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్
నవతెలంగాణ- గోవిందరావుపేట: పంచాయతీరాజ్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు మన ఎమ్మెల్యే దళసరి అనసూయ (సీతక్క) ఆదివారం నియోజకవర్గానికి వస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అపూర్వ రీతిలో స్వాగతం పలకాలని ములుగు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి పోర్టు పోలియో మంత్రిగా సీతక్క నియోజకవర్గానికి మరియు మేడారం వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా సోదరమణులు అధిక సంఖ్యలో పాల్గొని సీతక్క పర్యటన జయప్రదం చేయాలని అన్నారు. గత రెండు పర్యాయములు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ప్రతిపక్షంలో ఉండి ప్రజల సమస్యల పరిష్కారంలో నిరంతరం శ్రమించిన సీతక్క ఈసారి మన ప్రభుత్వంలో మంత్రిగా వస్తున్న సందర్భంగా మన ఆత్మీయ విశ్వాసాన్ని వ్యక్తం చేయాలని అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో ఈసారి ముందుంటామని అన్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీలో రెండింటిని అమలు చేస్తున్న ప్రభుత్వం మిగతా గ్యారెంటీలను కూడా వీలైనంత త్వరగా అమలుపరిచి ప్రజలకు అందుబాటులోకి తెస్తుందని అన్నారు. సీతక్క మంత్రిగా ఈసారి మన ములుగు నియోజకవర్గము గజ్వేల్ సిరిసిల్ల సిద్దిపేట తరహాలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. మన ప్రభుత్వంలో మన మంత్రిగా తొలిసారి మన నియోజకవర్గానికి వస్తున్న సీతక్కకు కార్యకర్తలందరూ మనస్ఫూర్తిగా స్వాగతం పలకాలని మరోమారు కోరుతున్నానని అన్నారు.