కుట్రలతో నన్ను ఇబ్బంది పెట్టారు : సీతక్క

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎవ్వరికీ వారు చాలా ధీమాగా ఉన్నారు. రేపు ఎన్నికల ఫలితాలు విడుదలవుతుండటం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్క అలియాస్ అనసూయ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు కుట్ర రాజకీయాలతో నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఆడబిడ్డగా ములుగు ప్రజలు ఆదరించారు. చిన్నపిల్లలు కూడా నాకే మద్దతి ఇచ్చి అక్కున చేర్చుకున్నారు. నా జీవితానికి ఇంకేం కావాలి..? నా గెలుపు కోసం కష్టపడ్డ వారి అందరికీ ధన్యవాదాలు తెలిపారు. నేను ఎప్పుడూ మీ సేవకురాలని.. నేను ములుగు ప్రజల వెంటే ఉంటాను. కాంగ్రెస్ ప్రభుత్వం లో సంక్షేమంతో అభివృద్ధి చేస్తాను. నన్ను రియల్ అన్నారు. నేను కష్ట కాలంలో ప్రజల వెంటే ఉన్నా. వారికి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. నన్ను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. నాకు కార్యకర్తలను డబ్బులతో కొనుగోలు చేసి తప్పుడు ప్రకటనలు ఇప్పించారు. ఏ కష్టం వచ్చినా జనం వెంటే ఉంటాం. పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ ప్రధాని అయ్యేవిధంగా కృషి చేస్తాం. ఎన్నికల్లో కష్టపడ్డ వారి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love