బీజేపీ అసమర్థ పాలన ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబిస్తుంది: సీతారాం ఏచూరి

నవతెలంగాణ కోయంబత్తూరు: దేశంలో నిరుద్యోగిత రేటు (Unemployment Rate) విపరీతంగా పెరిగిపోయిందని, ప్రపంచ ఆహార సూచీలో కూడా భారత్‌ స్థానం మరింత దిగజారిందని సీపీఐ (ఎం) (CPIM) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitaram Yechury) అన్నారు. దాంతో ప్రజాసంక్షేమం మంటగలిసిందని అన్నారు. పేదల ప్రజల జీవితాలు భారంగా మారాయని చెప్పారు. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(BJP) తన అసమర్థ పాలనకు ఫలితాన్ని చవిచూస్తుందని ఏచూరి అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా బీజేపీ భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో ప్రభుత్వ మార్పు తప్పక జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకోసం ఇండియా కూటమిని మరింత బలోపేతం చేయాలని తమ పార్టీ నిశ్చయిందని చెప్పారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పోలిట్ బ్యూరో సభ్యులు రామకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love