– సిపిఎం మండల కార్యదర్శి పెరుమాండ్ల తిలక్ బాబు
నవతెలంగాణ-నెల్లికుదురు : సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని సిపిఎం మండల కార్యదర్శి పెరుమాండ్ల తిలక్ బాబు సిఐటియు మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు అన్నరు. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి సిపిఎం పోరాటాలకు విద్యార్థి యువజన ప్రజా సంఘాల్లో చురుకైన పాత్ర పోషించి అం చలంచెలుగా సిపిఎం ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా ఎదిగి పార్టీకి ఎనలేని సేవలు త్యాగాలు నిర్వహించిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి అని అన్నారు ఆయన మృతి వల్ల భారతదేశానికి జాతీయస్థాయిలో తీరని లోటు అని ఆయన మరణం పార్టీ కార్యకర్తల మనోవేదనకు గురయ్యారని సీతారాం ఏచూరి ఆయన చేసిన పోరాటాలు భవిష్యత్తులో రైతుల కూలీలు విద్యార్థులు యువజన సంఘాలు మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వెంకన్న ఐలేష్ ఉప్పలయ్య శ్రీను రాములు కిషన్ తదితరులు పాల్గొన్నారు