– బండారి రవికుమార్, సూడి కృష్ణారెడ్డి సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు
నవతెలంగాణ – గోవిందరావుపేట
సీతారాం ఏచూరి మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు అని సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండారి రవికుమార్ సూడి కృష్ణారెడ్డిలు అన్నారు. మంగళవారం మండలంలోని పస్రా గ్రామంలో సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయం లో కామ్యూనిస్ట్ స్థిత ప్రజ్ఞ్యుడు సీతారం ఏచూరి యొక్క సంతాప సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి సభ్యులు బండారి రవికుమార్, సూడి కృష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ.. సీతారామ్ ఏచూరి మరణం కామ్యూనిస్ట్ పార్టీ కి తీరని లోటు అని అంతేగాక దేశ రాజకీయాలలో కూడా అతను ఒక పార్లమెంట్ సభ్యులు గా ఎంతో ప్రాధాన్యత గల ప్రజా ప్రతినిధి గా గుర్తింపు పొందారని అన్నారు. వారి కుటుంబ సభ్యులు కోరిక మేరకు తను ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండే వారు కానీ వారు పోరాట మార్గాన్ని ఎంచుకున్నారని, దేశ అత్యవసర పరిస్థితి సందర్బంగా విధించిన నిర్భందం వలన తను పీహెచ్డీ పూర్తి చేసే అవకాశం కోల్పోయారని ఈ సందర్బంగా తెలియజేసారు. అన్ని పార్టీల నాయకుల చేత విలువగల పార్లమెంట్ సభ్యులుగా గుర్తింపు పొందరని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి, మండల కార్యదర్శి తీగల ఆగిరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బీరెడ్డి సాంబాశివ, పొదిల్ల చిట్టిబాబు, కొప్పుల రఘుపతి, రత్నం రాజేందర్, జిల్లా కమిటీ సభ్యులు ఎండీ దావూద్, గొంది రాజేష్, దుగ్గి చిరంజీవి జాగటి చిన్నా గ్రామ కార్యదర్శి కడారి నాగరాజు సభ్యులు కవిత పల్లపు రాజు తదితరులు పాల్గొన్నారు.