పల్లె దవాఖాన ఏర్పాటు కోసం స్థల పరిశీలన

నవతెలంగాణ-జగిత్యాలటౌన్‌
జగిత్యాలరూరల్‌ మండలం తాటిపల్లి గ్రామంలో పల్లె దావాఖాన ఏర్పాటు కోసం గ్రామ నాయకులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్‌ సంజరు కుమార్‌ స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించడం కోసం సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో బస్తి దవాఖాన, పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్‌ ఐటి రంగాల్లో దేశం లోనే అగ్ర బాగాన తెలంగాణ ఉందని తెలిపారు. గ్రామానికి చెందిన ఆంజనేయ చారి కూతురు ధరణి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. వారి వెంట నాడెం రత్నమాల శంకర్‌, బక్కశెట్టి ఆంజనేయులు, పాయి కారి సురేష్‌, ఎంబారి మహేష్‌, కిష్ట నారాయణ, అక్షరు, విజరు, నాయకులు తదితరులు ఉన్నారు.
బిఆర్‌ఎస్‌లో పలువురి చేరిక
జగిత్యాలరూరల్‌ మండలం గుల్లపేట గ్రామానికి చెందిన 15 మంది విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు బీఆర్‌ఎస్‌లో చేరగా వారికి ఎమ్మెల్యే డాక్టర్‌ సంజరుకుమార్‌ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్రప్రసాద్‌, సర్పంచ్‌ జక్కుల తిరుపతి, ఎంపీటీసీ సురేందర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు దమ్మా రాజీరెడ్డి, తిప్పర్తి నరేష్‌ పాల్గొన్నారు.
జగిత్యాల అర్బన్‌ మండలం అంబారిపేట గ్రామంలో మాజీ సర్పంచ్‌ వూరెడి గంగాధర్‌ భార్య సుజాత మరణించగా, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్‌ గొడిశెల గంగాధర్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ పోగుల నారాయణ, నాయకులు మాధ శంకరయ్య, అది వెంకటేష్‌, గొనేల బక్కన్న, గొడిశెల తిరుపతి, బొక్కల వెంకన్న, గంగారెడ్డి పాల్గొన్నారు.

Spread the love