కామారెడ్డి జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ రోజున శివలింగ బతుకమ్మను పేర్చి తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12 వార్డు విద్యుత్ నగర్ కాలనీ దేవనపల్లికి చెందిన అంగన్వాడి టీచర్ వైద్య ఉమారాణి ధర్మకోల్ ఉపయోగించి శివలింగా కృతిలో పువ్వులతో బతుకమ్మ తయారుచేసి తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రకృతి పరంగా, ఆధ్యాత్మికపరంగా ఈ బతుకమ్మ ఎంతో శోభను కలిగిస్తుంది అనే ఆమె పేర్కొన్నారు. ఆమె తయారుచేసిన శివలింగ బతుకమ్మ పలువురుని ఆకర్షించింది.