నవతెలంగాణ – అస్సాం: అస్సాంలోని కోక్రాఝర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి కచుగావ్ లో రెండు కార్లను భక్తులతో వెళుతున్న ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు కార్లలోని ఆరుగురు వ్యక్తులు మరణించగా.. నలుగురు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.