నవతెలంగాణ – ముంబాయి: ముంబయిలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోర్గోన్ ప్రాంతంలోని ఓ భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మంటల్లో చిక్కుకుని గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 30 మందికిపైగా గాయపడ్డారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల ప్రకారం.. గోర్గోన్ ప్రాంతంలో ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగినట్లు మాకు సమాచారం అందింది. వెంటనే మేం ఫైర్ ఇంజిన్ను అలర్ట్ చేసి ఘటనాస్థలికి చేరుకున్నాం. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఈ ఘటనలో ఆరుగురు సజీవదహనమయ్యారు. 30కి పైగా మందికి గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం జరిగింది.