పెండ్లికి వెళ్లి వస్తోండగా ప్రమాదం..ఆరుగురు మృతి

road-accidentనవతెలంగాణ – బల్లియా: ఉత్తరప్రదేశ్‌లో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బల్లియా జిల్లా బైరియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జీపు కారు- పికప్ ట్రక్ ఢీ కొన్నాయి. మంగళవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నలుగురిని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తోండగా ఈ ప్రమాదం జరిగింది.

Spread the love