కల్తీ కల్లు తాగి ఆరుగురికి అస్వస్థత..

నవతెలంగాణ – వేములవాడ రూరల్
కల్తీ కల్లు వారి ప్రాణాలమీదకు తెచ్చింది, కల్తీకల్లు తాగడంతో తీవ్ర అస్వస్థకు గురయారు, ఈ విషాదకర ఘటన వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. అస్వస్థకు గురైన సురేష్, ప్రకాష్, తిరుపతి, శ్రీనివాస్, రాజు, రాజులను గ్రామస్థులు గమనించి చికిత్స నిమిత్తం వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇందులో అయిదుగురు పరిస్థితి  మెరుగ్గా ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు, ఒకరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.డీఎస్పీ నాగేంద్రాచారి, రూరల్ ఎస్ఐ మారుతి ఆసుపత్రికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు.రూరల్ ఎస్ఐ మారుతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Spread the love