భారీగా గంజాయి పట్టివేత..ఆరుగురు అరెస్ట్​

నవతెలంగాణ-హైదరాబాద్ : రాచకొండ పోలీస్​స్టేషన్​ పరిధిలో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. ఏపీలోని సీలేరు నుంచి ఆరుగురు నిందితులు హైదరాబాద్​ మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి తరలిస్తున్నారు. చౌటుప్పల్​దగ్గర ఎల్ బీ నగర్​ ఎస్​ వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలో రెండు కార్లలో తరలిస్తున్న రూ.40 లక్షల విలువైన 200 కిలోల గంజాయి పట్టుబడింది. కార్లలోని ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి కార్లు, మొబైల్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Spread the love