ఆటో బోల్తా… ఆరుగురికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ-కేశంపేట
ఆటో బోల్తా పడి ఆరు గురు తీవ్రంగా గాయప డ్డారు. ఈ సంఘటన కేశంపేట మండలం అల్వాల గ్రామ ముఖ్య కూడలి సమీ పంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెల్దండ మండలం పల్గు తండాకు చెందిన గిరిజనులు కొత్తూరు మండలం వైఎం తండాలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఆటోలో వెళ్లారు. వివాహ కార్యక్రమం అనం తరం తిరుగు ప్రయాణంలో ఆటో డ్రైవర్‌ అతివేగంగా, అజాగ్రత్తతో ఆటోను నడపడంతో అల్వాల ముఖ్య కూడలి సమీపంలో సిమెంటు దిమ్మెను ఢకొీని ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో రూప్‌సింగ్‌, అర్జున్‌, సాలి, బుజ్జిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్ప త్రికి తరలించారు. బాధితుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్టు ఎస్‌ఐ ధనుంజరు తెలిపారు.

Spread the love