నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట గిరిజన నియోజక వర్గం నెంబర్ 118 కి జరుగుతున్న సాధారణ ఎన్నికలకు ఆరో రోజు అయిన గురువారం నాలుగు నామినేషన్ లు దాఖలు అయినట్లు ఎన్నికల అధికారి,అదనపు కలెక్టర్ డాక్టర్ పి.రాంబాబు తెలిపారు. వాసం పోలయ్య(ఆబాద్ పార్టీ),పద్దం వెంకట రమణ(ఎలఐన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ)జారే ఆదినారాయణ(కాంగ్రెస్),ఊకే రవి(గోండ్వానా దండకారణ్య పార్టీ) తరుపున నామినేషన్లు దాఖలు చేసారు.ఇప్పటి వరకు 9 మంది అభ్యర్ధులు 10 నామినేషన్ సెట్ లు దాఖలు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారి,స్థానిక తహశీల్ధార్ క్రిష్ణ ప్రసాద్,ఎన్నికల సిబ్బంది ఉన్నారు.