జిల్లా ఉత్తమ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఎస్ కే మస్తాన్

నవతెలంగాణ-గోవిందరావుపేట : ములుగు జిల్లా ఉత్తమ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ షేక్ మస్తాన్ ఎంపికయ్యారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం చేతులమీదుగా ములుగు జిల్లా ఉత్తమ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఎస్ ఐ షేక్ మస్తాన్ అవార్డు అందుకున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ విభాగానికి గాను ఫంక్షనల్ వర్టికల్లో కానిస్టేబుల్ విక్రమ్ ఎన్నిక కావడం జరిగింది.ములుగు జిల్లా ఉత్తమ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా స్థానిక ఎస్ ఐ షేక్ మస్తాన్ ఎంపిక కావడం పట్ల స్థానిక మండల ప్రజలు ప్రజాప్రతినిధులు వ్యాపారులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రశంసిస్తున్నారు. అనతి కాలంలోనే బాధ్యతలు చేపట్టిన మస్తాన్ విధి నిర్వహణలో కూడా చక్కగా రాణిస్తూ స్థానిక ప్రజల మనలను పొందుతున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను ప్రజల్లోకి తీసుకు వెళుతున్నారని  ఇది ఎంతో అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముందు ముందు ఎస్సై మస్తాన్ మరెన్నో అవార్డులను రివార్డులను సొంతం చేసుకోవాలని స్థానిక మండల ప్రజలు కోరుకుంటున్నారు.
Spread the love