కంపుకొడుతున్న చెత్త..

– ఎక్కడి చెత్త అక్కడే..
– పెరుగుతున్న దోమల బెడద
– కనిపించని దోమల నివారణ
– పారిశుద్ధ్య సమస్యతో జనం అవస్థలు
కొంతకాలంగా దుర్గా భవానీ నగర్‌ కాలనీలో పారిశుద్ధ్య పనులు ఆటకెక్కాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో చెత్త పేరుకు పోయి ఈగలు, దోమల బెడద పెరిగిపోయింది. దీనికి తోడు దుర్వాసనతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక్కడి ఇబ్బందులు ఎవరికీ కనబడడంలేదా..? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పారిశుద్ధ్య అధికారులకు చెత్త తొలగింపుపై చిత్తశుద్ధి లేదా.. అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ – సంతోష్‌ నగర్‌
డివిజన్‌ లోని సంతోష్‌ నగర్‌ దుర్గా భవానీ నగర్‌ తదితర కాలనీల్లో చెత్త కుప్పలను తరలించ కపోవడంతో వ్యర్థాలు పేరుకుపోయి చెత్త రోడ్ల పైకి విస్తరిస్తోంది. ఈ క్రమంలో వర్షపు చినుకు లకు చెత్త కుంపు కొడుతోంది. ఈదురు గాలుల కు చెత్త మొత్తం రోడ్డును ముంచెత్తుతుంది. దీం తో ప్రజలు అసహనానికి గురవుతున్నారు. కాలనీ వైపు ప్రయాణించే వాహనదారుల, పాదచా రులను ఈచెత్త తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.
దోమల నివారణకు చర్యలు ఎక్కడ..?
చెత్త పేరుకుపోతుండగా, దోమల నివారణ కు మందును సైతం పిచ్చికారి చేయడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం అన్న తేడా లేకుండా దోములు, ఈగలు, దుర్వాసన ఇబ్బందికరంగా మారుతోందని పలువులు ఆరోపిస్తున్నారు. రహదారుల వెంట ప్రయాణం చేయాలంటే ప్రజలు ముక్కున వేలేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. ఎప్పటి కప్పుడు చెత్తను తొలగించాలని ఎన్నిసార్లు కోరినా.. తమ గోడు పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సత్వరమే పరిష్కారానికి చర్యలు : డాక్టర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి ఏఎంహెచ్‌ వో
చెత్త సమస్య నా దృష్టికి రాలేదు. వెంటనే సమస్య ఆత్మక ప్రాంతాలలో సిబ్బందితో పర్యటించి సత్వరమే పరిష్కారానికి కృషి చేస్తాను. దోమల నివారణకు మందుల పిచికారి చేయిస్తున్నాం. సిబ్బంది కొరతతో కొంత ఇబ్బందిగా ఉంది. కానీ అన్ని ప్రాంతాల్లో సమస్యను పరిష్కారిస్తాం.

Spread the love