టైమ్ సెన్స్
కుమార్ : మా సెక్రటరీ చాలా సిన్సియర్‌గా పనిచేస్తాడురా. టైమ్ సెన్స్‌ను బాగా పాటిస్తాడు.
హరీష్ : నీకెలా తెలుసు?
కుమార్ : ఆఫీసులో చేరిన రోజు నుంచి ఏ రోజూ టీ టైమ్‌ను మిస్ కాలేదు.
అంతా సమానమే
వెంకటేష్ : మీ ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కి ఒక్క రెక్క కూడా లేదేమిటి సార్?
సుబ్రహ్మణ్యం : మా ముగ్గురు పుత్రరత్నాలు ఆస్థి పంపకాల్లో తలో రెక్క లాక్కుపోయారు!
అతి తెలివి
టీచర్ : నువ్వు పెద్దయ్యాక ఏం చేస్తావ్?
విద్యార్థి : పెళ్ళి చేసుకుంటా.
టీచర్ : అది కాదురా.. ఏమవుతావని అడుగుతున్నా.
విద్యార్థి : పెళ్ళికొడుకునవుతా.
టీచర్ : నా ఉద్దేశ్యం పెద్దయ్యాక ఏం సాధిస్తావని?
విద్యార్థి : పెళ్ళికూతుర్ని సాదిద్దామనుకుంటున్నా.
టీచర్ : ఒరేరు… నా ప్రశ్న నీకర్థం కావట్లేదా, నేనడిగేది మీ అమ్మానాన్నల కోసం ఏం తెస్తావని?
విద్యార్థి : కోడల్ని తెద్దామనుకుంటున్నా సార్.
టీచర్ : అది కాదురా బాబూ… మీ నాన్న నీ దగ్గర్నుంచి ఏం కోరుకుంటున్నాడు?
విద్యార్థి : మనవణ్ణి.
టీచర్ : పోనీ… నీ జీవితాశయమేంటో అదన్నా చెప్పు?
విద్యార్థి : మేమిద్దరం, మాకిద్దరు.