నవ్వుల్‌ పువ్వుల్‌

చావడానికి పర్మిషన్‌
పురుగుల మందు షాపుకు వెళ్లాడు ఓ వ్యక్తి.
‘పురుగుల మందు డబ్బా ఒకటి కావాలి’ అనడిగాడు.
‘ఇలా అడిగితే ఇవ్వడం కుదరదు. పర్మిషన్‌ లెటర్‌ కావాలి’ అన్నాడు షాపు ఓనరు.
‘ఉందిగా..’ అంటూ టక్కున మ్యారెజ్‌ సర్టిఫికెట్‌ తీసి చూపించాడు ఆ వ్యక్తి.
కొనుక్కోవచ్చు కదా!
పేషెంట్‌ దగ్గరికి కంగారుగా వచ్చాడు డాక్టర్‌.
‘మీకు ఆపరేషన్‌ చేసేటప్పుడు పొరబాటున పొట్టలోనే గ్లౌజ్‌ మరచిపోయాను. మళ్లీ ఆపరేషన్‌ చేసి తీయాల్సి ఉంటుంది’ అన్నాడు.
‘ఇరువై రూపాయలు పెట్టి మళ్లీ కొనుక్కోవచ్చు కదా! దానికి మళ్లీ ఆపరేషన్‌ చేయడం అవసరమా…?’ విరుచుకుపడ్డాడు పేషేంట్‌.
అలా కుదరుదు గానీ…

భార్యను చూపించడానికి ఆస్పత్రికి తీసుకెళ్లాడు భర్త.
వైద్య పరీక్షల అనంతరం డాక్టర్‌ చాంబర్‌ నుంచి బయటకు వచ్చిన భార్య
‘స్ట్రెస్‌ ఎక్కువైందన్నారు. మానసిక ప్రశాంతత కోసం ఫారిన్‌ టూర్‌ ప్లాన్‌ చేసుకుంటే మంచిదని చెప్పారు’ అంది.
‘అయితే వెళ్దాం’ అన్నాడు భర్త.
‘ఎక్కడికి? స్విట్జర్లాండ్‌కా.. సింగపూర్‌కా..?’ అనడిగింది ఆతృతగా.
‘వేరే డాక్టర్‌ దగ్గరికి’ చెప్పాడు భర్త.

Spread the love