నవ్వుల్‌ పువ్వుల్‌

Sunday Funగుండె ఆగి..
భార్య : నేను చచ్చిపోతే మీరెలా ఫీలవుతారు?
భర్త : నేనూ చచ్చిపోతాను
భార్య : మీరెందుకు చచ్చిపోతారు?
భర్త: ఆనందం ఎక్కువై గుండె ఆగిపోదా మరి!

రెండిటి మధ్య తేడా

ఒక ఫ్రెండ్‌ మరో ఫ్రెండ్‌తో ‘లోఫర్‌, ఆఫర్‌ మధ్య తేడా ఏమిట్రా?’
‘అబ్బాయి ఐ లవ్‌ యూ చెబితే.. ఆమెకు వాడు లోఫర్‌.
అమ్మాయి ఐ లవ్‌ యూ చెబితే .. అతడికి ఆమె ఇచ్చే ఆఫర్‌’
రహస్యం
సుబ్బారావు : 70 ఏళ్ళొచ్చినా మీ భార్యని డార్లింగ్‌, హనీ అని ఎంతో ప్రేమగా పిలుస్తున్నారంటే మీకు ఆమె మీద చాలా ప్రేమ ఉంది కదా సర్‌.
వెంకట్రావు : ప్రేమా, ఇంకేమన్నానా… నా భార్య పేరు మర్చిపోయానయ్యా, ఆ విషయం తెలిస్తే ఏమంటుందోనని అలా పిలుస్తానంతే.
అర్హత
కొడుకు : నాన్నా, నేను పెళ్ళి చేసుకుంటాను.
తండ్రి : అయితే క్షమాపణలు చెప్పు.
కొడుకు : ఎందుకు? తప్పు చేయకుండా నేనెందుకు క్షమాపణ చెప్పాలి?
తండ్రి : ముందు క్షమాపణలు చెప్పు.
కొడుకు : సరే సారీ నాన్నా.
తండ్రి : గుడ్‌… ఇప్పుడు నువ్వు పెళ్ళికి అర్హుడివి. ఎప్పుడైతే నీ తప్పు లేకుండా సారీ చెప్పగలవో, అప్పుడు నువ్వు పెళ్ళికి సిద్ధం కావచ్చన్నమాట.
పది తక్కువ
కొడుకు : ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఇచ్చారు నాన్నా…
తండ్రి : ఎన్ని మార్కులొచ్చాయి?
కొడుకు : రాము కంటే పది మార్కులు తక్కువ
తండ్రి : రాముకి ఎన్ని మార్కులు వచ్చాయి?
కొడుకు : పది మార్కులు.
ఒకే కోరిక
సోమేష్‌ : నేను మా నాన్నలాగే డాక్టర్‌ కావాలని కోరుకుంటున్నాను.
గోపి : ఏంటి, మీ నాన్న డాక్టరా?
సోమేష్‌ : కాదు. మా నాన్న కూడా నాలాగే కోరుకున్నారంట.

Spread the love