నవ్వుల్‌ పువ్వుల్‌

భలే… భలే…
విమాన ప్రయాణంలో ఇండియన్స్‌కి వైన్‌ ఇవ్వడం నిషేధించారు. ఎందుకంటే…
బ్రిటిషర్‌ – నేను పడుకుంటా!
అమెరికన్‌ – నేను ఇంటర్నెట్‌లో పనిచేసుకుంటా!
జర్మన్‌ – నేను మ్యూజిక్‌ వింటా!
చైనీస్‌ – నేను సినిమా చూస్తా!
ఇండియన్‌ – మామా, తప్పుకో! నేను ఫ్లైట్‌ నడుపుతా!
టైం సరిపోవద్దూ!
టీచర్‌ : పరీక్షలొస్తున్నాయి కదా స్కూలుకు ఎందుకు రావట్లేదు?
విద్యార్థి : కాపీ కొట్టడానికి స్లిప్పులు రెడీ చేసుకోవడానికి టైమ్‌ కావాలిగా అందుకని..!
దొంగతనం
రాజేష్‌ : పొద్దున నుంచి నదిలో ఈత కొడుతున్నారు. ఏదైనా గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కేందుకు ట్రై చేస్తున్నారా?
సురేష్‌ : అదేం కాదండి బాబూ.. పొద్దున్నే నా బట్టలెవరో ఎత్తుకుపోయారు..!
కరెక్షన్‌
ప్రమోద్‌ : టీచర్‌ని ప్రేమించడం తప్పయిపోయిందిరా బాబూ.
వినోద్‌ : ఏమైంది?
ప్రమోద్‌ : లవ్‌ లెటర్‌ నోట్‌బుక్‌లో రాసి ఇస్తే హోమ్‌వర్క్‌ అనుకుని తప్పులు దిద్ది ఇచ్చింది.
నాన్‌వెజ్‌ మానెయ్యాలి
భార్య : డాక్టర్‌గారు నన్ను నాన్‌వెజ్‌ తినడం మానెయ్యమన్నారండి.
భర్త : అయితే ఇకనుండి నన్ను కాల్చుకు తినడం మానెరు.

Spread the love